
Viswanath And Sons: డైరెక్టర్ వెంకీ అట్లూరి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని డైరెక్టర్ వెల్లడించారు. ఈ సినిమా తెరకెక్కడంలో నటి జ్యోతిక కీలక పాత్ర పోషించారని వెంకీ అట్లూరి తెలిపారు.
ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా కథలోని ముఖ్యమైన నేరేషన్‌ను జ్యోతికకు వినిపించిన తర్వాత ఆమె ఆ కథను ఎంతో ఇష్టపడ్డారని చెప్పారు. ముఖ్యంగా చిత్రంలోని ఫస్ట్ హాఫ్ ఆమెను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. కథపై జ్యోతిక ఇచ్చిన పాజిటీవ్ రెస్పాన్స్ తమ టీంకి ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని ఇచ్చిందని వెంకీ అట్లూరి పేర్కొన్నారు. ఆమె సూచనలు, ప్రోత్సాహం సినిమా తెరకెక్కడంలో కీలకంగా నిలిచాయని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. వెంకీ అట్లూరి కామెంట్స్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక చిత్రానికి సంబంధించిన మరిన్ని అధికారిక అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













