Anil Ravipudi: హిట్ మిషన్ అనిల్ రావిపూడి లైనప్ మామూలుగా లేదుగా.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌కు ప్లాన్!

Anil Ravipudi

Anil Ravipudi: టాలీవుడ్‌లో వరుస విజయాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ గట్టి ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, అనిల్ రావిపూడి రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి వరుసగా మూడు ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌తో కలిసి ఓ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అనిల్ రావిపూడి యానిమేషన్ జానర్‌లో సినిమా చేయనున్నారనే వార్త సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమాను తెరకెక్కించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో దిల్ రాజు బ్యానర్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో, మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందనే ప్రచారం జరుగుతోంది.

ఆ తర్వాత నిర్మాతలు సాహు, సతీష్ కిలారు సంయుక్తంగా నిర్మించనున్న మరో చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూడు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన హీరోలు, కథలు లేదా అధికారిక ప్రకటనలు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం వెంకటేష్–కల్యాణ్ రామ్ మల్టీస్టారర్‌పై పూర్తి దృష్టి పెట్టిన అనిల్ రావిపూడి, ఆ సినిమా పూర్తైన తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌లపై వరుసగా ముందుకు వెళ్లనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ లైనప్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది.