
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ‘బిర్యానీ’ పేరుతో ఉండే ఓ ప్రత్యేక పాత్ర కథలో అత్యంత కీలకంగా ఉండబోతుందట. ఈ రోల్లో సంపూర్ణేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. కథను కీలక మలుపు తిప్పే పాత్రల్లో ఇదొకటిగా ఉంటుందని, సినిమా మొత్తం మీద ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పాట కోసం ఆమె కేవలం రెండు రోజుల డేట్స్ మాత్రమే కేటాయించినట్లు తెలుస్తోంది. అయితే రెండు రోజుల షూటింగ్‌కే మేకర్స్ ఆమెకు రూ.1.5 కోట్ల వరకు పారితోషికం చెల్లిస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు, రాఘవ్ జుయాల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, కయాదు లోహర్ హీరోయిన్గా కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.













