
Mythri Movie Makers: టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్‌తో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో రాజ్-డీకే దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను రీల్ లైఫ్ ప్రొడక్షన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇటీవల సల్మాన్ ఖాన్‌కు కథను వినిపించగా, నరేషన్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ – రాజ్ – డీకే కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఇది బాలీవుడ్లో కీలకమైన అడుగుగా మారనుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














