
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లడీ రోమియో’. ‘రన్ రాజా రన్’, ‘సాహో’, ‘ఓజీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుజీత్.. తన మార్క్ స్టైలిష్ యాక్షన్, డార్క్ కామెడీ, గ్యాంగ్‌స్టర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా లెనిన్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న భాగ్యశ్రీ బోర్సేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని, హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
‘బ్లడీ రోమియో’ స్టోరీ ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ చుట్టూ సాగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోలో నాని పాత్రను చెఫ్‌తో పాటు గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌గా చూపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం నాని ‘ది ప్యారడైజ్’ పనులను పూర్తి చేసే పనిలో ఉండగా.. అనంతరం అక్టోబర్ 2026లో ‘బ్లడీ రోమియో’ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుండగా, ఆ తర్వాత లండన్‌లో షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని లండన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని – సుజీత్ కాంబినేషన్‌కు తోడు భాగ్యశ్రీ బోర్సే పేరు హీరోయిన్‌గా వినిపిస్తుండటంతో ‘బ్లడీ రోమియో’పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.














