
Meenakshi Chaudhary: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మెగా158’. ఈచిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ‘మెగా158’ టీమ్ మీనాక్షి చౌదరితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా కనిపించబోరని ప్రచారం జరుగుతోంది. కథలో కీలకమైన మలుపుకు కారణమయ్యే ఓ ప్రత్యేకమైన పాత్రలో ఆమె కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా మీనాక్షి చౌదరి పాత్ర సినిమా సెకండాఫ్‌లో ఎంట్రీ ఇస్తుందని, ఆమె క్యారెక్టర్ కథను మరో మలుపు తిప్పేలా ఉంటుందని టాక్. ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్లో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. దీంతో సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ కథకు మాత్రం చాలా ఇంపార్టెంట్‌గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే భారీ తారాగణం, ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న ‘మెగా158’పై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని కేవీన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే మీనాక్షి చౌదరి నటనపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్త నిజమా? ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక అప్డేట్ రావాల్సిందే.














