
Viswanath and Sons: స్టార్ హీరో సూర్య, యువ దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం రేపు (14 ఆగస్టు) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందే భారీ స్థాయిలో బిజినెస్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సుమారు రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌లోనే దూసుకెళ్లినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా థియేట్రికల్, ఓటీటీ, ఆడియో, శాటిలైట్ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ థియేట్రికల్ రైట్స్ సుమారు రూ.90 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.85 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్ ద్వారా రూ.12 కోట్లు, శాటిలైట్ హక్కుల ద్వారా మరో రూ.28 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అన్ని హక్కులను కలిపి ఈ చిత్రం సుమారు రూ.215 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు రిలీజ్‌కి ముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం చిత్రంపై ఉన్న క్రేజ్‌ను చూపిస్తోందని అంటున్నారు. సూర్య స్టార్డమ్కు వెంకీ అట్లూరి డైరెక్షన్ తోడవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. మరి రిలీజ్‌కు ముందే ఈ స్థాయి భారీ బిజినెస్‌తో హాట్ టాపిక్‌గా మారిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. థియేటర్లలో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.














