
Vishwanath & Sons: వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి స్పందనతో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకు వస్తున్న స్పందన ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. నార్త్ అమెరికాలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వసూళ్లలో తెలుగు వెర్షన్ అనూహ్యంగా ఆధిపత్యం చూపిస్తోంది. ప్రీమియర్స్‌లో తెలుగు వెర్షన్ సుమారు $213K వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇదే సమయంలో తమిళ్ వెర్షన్ $95K వద్ద నిలిచింది. అంటే తమిళ్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్ వసూళ్లు రెండింతలకు పైగా ఉండటం విశేషంగా మారింది. ప్రీమియర్స్‌లో కనిపించిన ఈ ట్రెండ్ శుక్రవారం కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా నార్త్ అమెరికా మార్కెట్లో తమిళ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి మార్కెట్లో తెలుగు వెర్షన్ ఈ స్థాయిలో ముందంజలో ఉండటం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు కలిసొచ్చే అంశంగా మారింది. సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఓవర్సీస్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే, నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో ‘కరుప్పు’ సినిమా సుమారు $1.4 మిలియన్ వద్ద ముగిసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ ఈ స్థాయి వసూళ్లు సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా రాబోయే రోజుల్లో ఎలాంటి వసూళ్లను నమోదు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సోమవారం కలెక్షన్లు ఈ సినిమా అసలు బాక్సాఫీస్ ట్రెండ్‌ను అంచనా వేయడంలో కీలకంగా మారనున్నాయి. వీకెండ్ తర్వాత కూడా వసూళ్లలో ఇదే జోరు కొనసాగితే నార్త్ అమెరికాలో సినిమా మరింత బలమైన రన్ సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు వెర్షన్ చూపిస్తున్న ఆధిపత్యం సినిమాకు పాజిటివ్ సైన్‌గా కనిపిస్తోంది.














