
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ముగ్గురు చిన్నారులతో కలిసి కృష్ణుడికి పూజలు చేస్తున్న ఫోటోను ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ స్పెషల్ ఫ్యామిలీ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఈ ఫోటోపై ప్రేమను కురిపిస్తున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు కన్నయ్య జన్మదిన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇదే క్రమంలో రామ్ చరణ్ – ఉపాసన కూడా తమ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ చిన్నారులను కృష్ణుడు, రాధారాణి వేషధారణలో అందంగా ముస్తాబు చేసినట్లు ఫోటోను గమనిస్తే అర్థమవుతోంది.
అయితే ఈ ఫోటోలో చిన్నారుల ముఖాలను మాత్రం రామ్ చరణ్ – ఉపాసన దంపతులు రివీల్ చేయలేదు. పిల్లల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని వారి ముఖాలు కనిపించకుండా ఫోటోను షేర్ చేసినట్లు అర్థం అవుతుంది. అయినప్పటికీ పూజా కార్యక్రమంలో తల్లిదండ్రులతో కలిసి చిన్నారులు పాల్గొన్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉపాసన ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ ఇంట్లో చిన్న కృష్ణుడు, రాధారాణి సందడి చేసినట్లుగా భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. ప్రేమ, ఆనందం, దైవ ఆశీస్సులతో జన్మాష్టమి వేడుకలను జరుపుకున్నామని ఆమె తెలిపారు. దీంతో ఈ ఫ్యామిలీ మూమెంట్‌కు అభిమానుల నుంచి భారీగా స్పందన వస్తోంది.














