
Ram Gopal Varma: స్టార్ హీరో యశ్, నిర్మాత అల్లు అరవింద్‌కు సంబంధించిన పాత కామెంట్స్ వివాదం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ‘KGF’కు ముందు యశ్ ఎవరు? అంటూ అల్లు అరవింద్ గతంలో చేసిన కామెంట్స్ ఇటీవల మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యశ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంలోకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు. అల్లు అరవింద్ కామెంట్స్‌ను సమర్థిస్తూ ఆర్జీవీ తనదైన స్టైల్లో స్పందించారు. అసలు ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారో అర్థం చేసుకోకుండా వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై స్పందిస్తూ.. ఇదంతా ‘రిడిక్యులస్గా నవ్వొచ్చే విషయం’ అన్నట్టుగా ఆర్జీవీ వ్యాఖ్యానించారు.
ఆర్జీవీ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం.. అల్లు అరవింద్ ఉద్దేశం యశ్‌ను తక్కువ చేయడం కాదని, ఒక సినిమా ఒక నటుడి స్టార్‌డమ్‌ను ఎంత భారీ స్థాయికి తీసుకెళ్లగలదనే విషయాన్ని చెప్పడమేనని పేర్కొన్నారు. ‘KGF’కు ముందు యశ్ కన్నడలో అప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. ఆ సినిమా తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు వచ్చిందనేది వాస్తవమని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. తన వాదనకు ఉదాహరణగా ప్రభాస్, రిషబ్ శెట్టి పేర్లను కూడా ఆర్జీవీ ప్రస్తావించారు. ‘బాహుబలి’కి ముందు హిందీ ప్రేక్షకుల్లో ప్రభాస్‌కు అంతగా పరిచయం లేదని, ‘కాంతారా’కు ముందు రిషబ్ శెట్టి కూడా దేశవ్యాప్తంగా పెద్దగా తెలియదని ఆయన అన్నారు. అదే విధంగా ఒక సినిమా నటుడి మార్కెట్‌ను, గుర్తింపును పూర్తిగా మార్చగలదని వివరించారు.
అయితే ఈ వ్యాఖ్యలపై యశ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. యశ్ మాత్రం తన కెరీర్‌పై గతంలో స్పందిస్తూ ‘KGF’ తనకు మరింత విస్తృతమైన గుర్తింపు తీసుకొచ్చిందని అంగీకరించినప్పటికీ, ఒక సినిమా సక్సెస్‌లో నటుడితో పాటు అనేక మంది కృషి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ప్రేక్షకులు ఎప్పుడూ తప్పు చేయరని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. అల్లు అరవింద్ పాత కామెంట్స్, యశ్ స్పందన, తాజాగా ఆర్జీవీ చేసిన కామెంట్స్‌తో ఈ వ్యవహారం మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక సినిమా ఒక నటుడిని రిజినల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా మార్చగలదా? అనే అంశంపైనే అసలు చర్చ సాగుతోందని చెప్పొచ్చు.














