Nithiin: నితిన్‌తో ‘దండోరా’ డైరెక్టర్.. హాట్ టాపిక్ అదిరిపోయే అప్డేట్!

Nithiin

Nithiin: ‘దండోరా’ సినిమాతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు మురళీకాంత్. తాజాగా ఆయన మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన టాలీవుడ్ హీరో నితిన్‌తో సినిమా తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ‘కాంతార’ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రుక్మిణి, నితిన్ సరసన నటించనుండటంతో ఈ జోడీపై సినిమా ప్రేమికులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోను ఆసక్తి పెరిగింది.

ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నాని తన ప్రతిష్ఠాత్మక వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నిర్మిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో కోర్ట్ వంటి విభిన్న సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు మరో కంటెంట్ ఆధారిత చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకురానుందనే ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ షూటింగ్ జరుగుతోందట. సినిమా ప్రచారాన్ని గ్రాండ్‌గా స్టార్ట్ చేసేందుకు ప్రత్యేకంగా ఈ గ్లింప్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నితిన్‌ను ప్రేక్షకులకు కొత్త అవతార్‌లో పరిచయం చేసేలా వీడియోను డిజైన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, టైటిల్, విడుదల తేదీ వంటి పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.