Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’లో గాల్లో ఫైట్.. సుజీత్ ఇంటర్వెల్ ట్విస్ట్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Bloody Romeo

Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్‌లో ఒక భారీ స్టైలిష్ యాక్షన్ డ్రామా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘బ్లడీ రోమియో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల చివరి దశలో ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కథ, యాక్షన్ ఎపిసోడ్స్‌కు సంబంధించి ఒక సెన్సేషనల్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాలో నాని కోసం నెవర్ బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేసినట్లు టాక్. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే ఒక భారీ ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలవనుందట. గాల్లో ఎగురుతున్న విమానం బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత గ్రాండ్ విజువల్స్‌తో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను మేకర్స్ డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాలో వచ్చే ఒక ఊహించని మెయిన్ ట్విస్ట్‌కు లీడ్‌గా ఈ ఇంటర్వెల్ ఫైట్ ఉంటుందని, థియేటర్లలో ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Also Read :  Trisha: విజయ్ బర్త్‌డే వేడుకల్లో త్రిష.. కేక్ కటింగ్ ఫోటోతో ఆ పుకార్లకు చెక్!

ఈ చిత్రంలో అత్యధిక భాగం లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. దీని కోసం సుజీత్ అండ్ టీమ్ ఇప్పటికే లొకేషన్లను కూడా ఫైనల్ చేసిందట. నాని ప్రస్తుతం నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. ఈ ఏడాది దసరా పండుగ తర్వాత ‘బ్లడీ రోమియో’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని చెబుతున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 సమ్మకర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాని-సుజీత్ కాంబోలో రాబోతున్న ఈ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్‌పై అటు నాని ఫ్యాన్స్‌లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.