
Varanasi: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ – వరల్డ్ మూవీ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన షూటింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘వారణాసి’లో ఓ భారీ బుల్ ఫైట్ ఎపిసోడ్ ఉండనుందని, ఇది సినిమాలో అత్యంత కీలకమైన ఘట్టాల్లో ఒకటిగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో మహేశ్ బాబు పాత్రకు సంబంధించిన ఓ పవర్‌ఫుల్ ఎలివేషన్ షాట్‌లో బుల్ ఫైట్‌కు సంబంధించిన విజువల్ కనిపించింది. ఇప్పుడు అదే యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి స్థాయిలో చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ శివార్లలో వచ్చే వారం ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. రాజమౌళి తన సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్‌లను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తారనే విషయం తెలిసిందే. దీంతో ‘వారణాసి’లోని ఈ బుల్ ఫైట్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. మరోవైపు ‘వారణాసి’ని పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహా గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉండనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ వివిధ కాలాలు, ప్రాంతాల నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే సినిమాలోని బుల్ ఫైట్ ఎపిసోడ్‌కు సంబంధించిన తాజా షూటింగ్ సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














