Vishwambhara : ‘విశ్వంభర’ షూటింగ్ కంప్లీట్.. గ్రాండ్ డ్యాన్స్‌తో క్లైమాక్స్!

Vishwambara
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విభిన్నమైన పాత్రతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు. సోషియో ఫాంటసీ విజువల్ వండర్ ‘విశ్వంభర’ షూటింగ్ ఇటీవలే గ్రాండ్‌గా పూర్తయింది. వశిష్ఠ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ ఎపిక్ చిత్రానికి, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, మౌని రాయ్ పై చిత్రీకరించిన హై ఎనర్జీ డ్యాన్స్ నంబర్‌తో ఈ సినిమా షూటింగ్ ముగిసింది.

ఈ పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయగా, శ్యామ్ కాసర్ల రాసిన సాహిత్యం ఈ సాంగ్‌ను మాస్ ట్రీట్‌గా మార్చనుంది. గణేష్ ఆచార్య కోరియోగ్రఫీతో, 100 మంది డ్యాన్సర్లతో ఈ పాటను భారీగా తెరకెక్కించారు. ఇక చిరంజీవి తన సిగ్నేచర్ గ్రేస్‌తో స్టేజ్‌ను షేక్ చేయగా, మౌని రాయ్ తన డ్యాన్స్ స్పార్క్‌తో అదనపు ఆకర్షణగా నిలిచారు. ఈ పాట గ్రాండ్ విజువల్స్‌తో ప్రేక్షకులకు ఫెస్టివల్ మూడ్ తెస్తుందని సమాచారం.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా, ఆషికా రంగనాథ్ మరియు కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ ప్రత్యేక పుస్తకాన్ని లాంచ్ చేయడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. టీజర్, ఫస్ట్ సింగిల్ ఇప్పటికే విపరీతమైన స్పందన తెచ్చుకోగా, మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.