
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. గతంలో సమంత ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ అప్పుడు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత ఆ సినిమా సక్సెస్ మీట్‌లో ఈ వార్తలపై సమంత అఫిషియల్‌గా క్లారిటీ ఇచ్చారు. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సమంత అధికారికంగా ప్రటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సమంత సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. తాజాగా ఆమె ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం.. స్టార్ బ్యూటీ సమంతకు చిత్తూరులోని అత్తారింట్లో సీమంతం వేడుకలు నిర్వహించినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్టార్ బ్యూటీ డైరెక్టర్ రాజ్ నిడిమోరాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ‘మా ఇంటి బంగారం’ సినిమాతో భారీ సక్సెస్ అందుకుని రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇదే సమయంలో తన అభిమానులకు సామ్ తాను తల్లి కాబోతున్నట్లు శుభవార్త చెప్పారు. తాజాగా థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని వచ్చిన సమంత, చిత్తూరులోని కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అత్తారింట్లో ఆమెకు సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించినట్లు సమాచారం. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు బయటికి రావడంతో సామ్ ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.














