Venkatesh Maha: క్లాస్ డైరెక్టర్ మాస్ మోడ్‌లోకి.. రావు బహదూర్ డైరెక్టర్ రూట్ మార్చేశాడు!

WhatsApp Image 2026 07 13 at 2.04.15 AM

Venkatesh Maha: విభిన్న కథలు, ఆలోచింపజేసే చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ మహా ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన హీరో సత్యదేవ్‌తో రావు బహదూర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం థియేటర్స్‌లో పాజిటీవ్ టాక్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజాగా ఆయన మరోసారి హీరో సత్యదేవ్‌తో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త సినిమాను పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారని, ఇప్పటి వరకు వెంకటేష్ మహా చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సినిమా గతంలో వెంకటేష్ మహా తీసిన సినిమాలన్నింటికి పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఆయన తన శైలిని మార్చి మాస్ యాక్షన్ జానర్‌లో ఎలా మెప్పిస్తారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరోవైపు నటుడిగా విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న సత్యదేవ్‌కు కూడా ఈ చిత్రం కీలకంగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యాక్షన్‌కు ప్రాధాన్యం ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు వెంకటేష్ మహా, సత్యదేవ్ కాంబినేషన్ మళ్లీ కుదరడంపై ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. తర్వలోనే ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, నిర్మాణ సంస్థ వంటి పూర్తి వివరాలను చిత్రబృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.