
Deepika Padukone: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రాకా’ (Raaka). ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో ఏడు నెలల గర్భంతోనే షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. దీపికా పదుకొణె ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ, తన పాత్రకు సంబంధించిన కీలక షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో కూడా ఆమె నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తన రోల్‌కు అవసరమైన మేరకు కొన్ని యాక్షన్ సన్నివేశాలను స్వయంగా ఆమె చేస్తుండగా, మిగిలిన క్లిష్టమైన సన్నివేశాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘రాకా’ చిత్రాన్ని మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీపికా పదుకొణె ఏడు నెలల గర్భంతో షూటింగ్‌లో పాల్గొంటున్నారనే విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. అలాగే ఆమె యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారనే వార్తను కూడా మేకర్స్ ధృవీకరించలేదు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రచారంపై అధికారిక సమాచారం వెలువడితేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














