Bhagyashri Borse: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా భాగ్యశ్రీ బోర్సే రెమ్యునరేషన్!

Bhagyashri Borse

Bhagyashri Borse: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల విడుదలైన ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద పాజిటీవ్ టాక్‌తో హిట్ సొంతం చేసుకోవడంతో హీరోయిన్ భాగ్యశ్రీ క్రేజ్ మరింత పెరిగిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు ప్రచారం సాగుతోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు సుమారు రూ.1.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న భాగ్యశ్రీ బోర్సే, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల కోసం రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాలు వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ అయ్యే అవకాశముందని సమాచారం. 2027లో ఆమె హీరోయిన్‌గా కనీసం రెండు నుంచి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతునే మరోవైపు కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టేందుకు భాగ్యశ్రీ రెడీ అవుతుంది. ఆమె తమిళ అరంగేట్ర చిత్రం ‘సేయోన్’ (Seyon)పై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘లెనిన్’ సక్సెస్, భాగ్యశ్రీ బోర్సేకు పెరుగుతున్న డిమాండ్, వరుస అవకాశాలు, రెమ్యునరేషన్ హైక్‌తో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ హాట్ టాపిక్‌గా మారింది.