Prithviraj Sukumaran: రాజమౌళి హిస్టరీలోనే ఊహించని ట్విస్ట్.. ‘వారణాసి’ చేస్తుండగానే 9 సినిమాలు ఫినిష్ చేసిన మాలీవుడ్ స్టార్!

Prithviraj Sukumaran

Prithviraj Sukumaran: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వర్కింగ్ స్టైల్ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి జక్కన్న కాంపౌండ్‌లోకి అడుగుపెట్టి అగ్రిమెంట్‌పై సంతకం చేశారా.. ప్రాజెక్ట్ పూర్తయ్యే దాకా మరో సినిమా గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఉండదు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాప్ స్టార్స్ సైతం ఆయన మేకింగ్ కోసం ఏళ్ల తరబడి ఇతర చిత్రాలను పక్కనబెట్టేశారు. కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’ సెట్స్‌లో మాత్రం ఒక అరుదైన అద్భుతం జరిగింది. రాజమౌళి అలిఖిత నిబంధనలను సైతం బ్రేక్ చేస్తూ మాలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ఒక సంచలనాత్మక రికార్డును నెలకొల్పారు.

సాధారణంగా రాజమౌళితో వర్క్ చేసే ఏ నటుడైనా షూటింగ్ షెడ్యూల్స్, లుక్స్ మార్పుల వల్ల ఇతర ప్రాజెక్టులను ముట్టుకోవడానికే సాహసించరు. అలాంటిది జక్కన్న సినిమాకు సంబంధించిన కాల్షీట్లను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, క్యారెక్టర్ ఎనర్జీని పక్కాగా బ్యాలెన్స్ చేస్తూ ఒకే సమయంలో ఏకంగా 9 సినిమాలను (యాక్టర్‌గా, డైరెక్టర్‌గా) పట్టాలెక్కించి పూర్తి చేసేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో పృథ్విరాజ్ వర్కింగ్ స్పీడ్, డెడికేషన్ చూసి చిత్ర పరిశ్రమ నివ్వెరపోతోంది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఫారెస్ట్ అడ్వెంచర్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’లో పృథ్విరాజ్ సుకుమారన్ అత్యంత కీలకమైన పవర్‌ఫుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ మొత్తం విజయవంతంగా పూర్తయింది. అయితే అసలు సెన్సేషన్ ఏంటంటే.. ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ మొదలైనప్పటి నుంచి తన షూటింగ్ పార్ట్ పూర్తయ్యే మధ్య కాలంలోనే పృథ్విరాజ్ 9 సినిమాలను పట్టాలెక్కించి పూర్తి చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ విజువల్ వండర్‌లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కథానాయికగా అలరించనుండగా.. సీనియర్ నటులు మాధవన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తెచ్చేందుకు మేకర్స్ రిలీజ్ డేట్‌ను ఇప్పటికే ఖరారు చేశారు.