Salman Khan: లైవ్‌లోనే టీషర్ట్ విప్పేసిన సల్మాన్ ఖాన్.. ‘నన్ను ట్రోల్ చేస్తారా?.. చేసుకోండి!’

Salman Khan

Salman Khan: సెలబ్రిటీలన్నాక ట్రోలింగ్ సర్వసాధారణం. వయసు, రూపం, ఫిజిక్.. ఇలా ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి విమర్శించే సోషల్ మీడియా సంస్కృతి పెరిగిపోయిన ఈ రోజుల్లో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ‘బిగ్‌బాస్’ వేదికపై ఆయన చేసిన ఒకే ఒక్క పని.. ఇప్పుడు నెట్టింట పనిగట్టుకుని విమర్శలు గుప్పించే ట్రోలర్ల నోళ్లను మూయించేలా చేసింది. షో జరుగుతున్న టైంలో సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా తన టీషర్ట్‌ను విప్పి, తన ఫిజిక్‌ను కెమెరాల ముందుంచారు. అంతటితో ఆగకుండా, “నన్ను ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోండి.. డోంట్ కేర్” అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇది కేవలం షో రేటింగ్స్ కోసమో, కెమెరా ముందు చేసిన విన్యాసమో కాదని.. తనపై వచ్చే నెగిటీవ్ కామెంట్స్‌ను లెక్కచేయని ఒక స్టార్ హీరో విసిరిన పవర్ ఫుల్ స్టేట్‌మెంట్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

“నేను ఎలా ఉన్నానో నాకు స్పష్టంగా తెలుసు. నన్ను మీరు ఎలా చూస్తారనేది పూర్తిగా మీ సమస్య.. నా సమస్య కాదు” అనే సల్మాన్ ఖాన్ అన్నారు. మనం ఏం చేసినా జడ్జ్ చేసేవాళ్లు, ప్రతి అడుగులోనూ తప్పులు వెతికేవాళ్లు సమాజంలో ఎప్పుడూ ఉంటారు. కానీ ఎదుటివారి అభిప్రాయాలకు అనుగుణంగా బతకడం మానేసిన రోజే ఒక మనిషిలో అసలైన ఆత్మవిశ్వాసం స్టార్ట్ అవుతుందని ఆయన చెప్పారు. ప్రపంచం మొత్తం మనల్ని మెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని మనం పూర్తిగా ప్రేమించుకోగలగడమే నిజమైన గెలుపు అనే విషయాన్ని సల్మాన్ తన ప్రవర్తనతో నిరూపించారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రోలింగ్‌తో మానసికంగా కుంగిపోయే నేటి తరానికి సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఈ రియాక్షన్ ఒక బోల్డ్ లెసన్ లాంటిదని చెబుతున్నారు. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని తెలిసినప్పుడు, ఇతరుల విమర్శలను పక్కనపెట్టి స్వేచ్ఛగా బతకడమే అసలైన ధైర్యమని సల్మాన్ యాటిట్యూడ్ గుర్తుచేస్తోందంటున్నారు. ప్రస్తుతం భాయ్‌జాన్ చేసిన ఈ సాహసోపేతమైన ఫీట్, ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.