
George Krish: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి బరి ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. వచ్చే ఏడాది పండగ బరిలో నిలిచేందుకు ఛార్మింగ్ స్టార్ శర్వానంద్, ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ శ్రీను వైట్ల తమ లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘జార్జ్ క్రిష్’తో గట్టిగా సిద్ధమవుతున్నారు. పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్న చిత్ర బృందం, తాజాగా ప్రమోషన్ల వేగాన్ని పెంచుతూ ఓ అదిరిపోయే అప్డేట్తో ఆడియన్స్‌లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సెప్టెంబర్ 24న ‘ఫస్ట్ బూస్టర్’ పేరుతో ఓ సాలిడ్ కంటెంట్‌ను వదలబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది అదిరిపోయే ఫస్ట్ గ్లింప్స్ రూపంలో రానుందా, లేక అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఫస్ట్ లిరికల్ సాంగ్‌తో ఎంట్రీ ఇస్తుందా అనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేపుతోంది.
మేకర్స్ వదిలిన పోస్టర్ చూస్తుంటే పూర్తిస్థాయి ఫన్ అండ్ యాక్షన్ గ్లింప్స్ కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, ఈ సర్ ప్రైజ్ ఏంటో తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ అందిస్తున్న సంగీతం ప్రధాన బలంగా నిలవనుంది. శ్రీను వైట్ల మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు శర్వానంద్ ఎనర్జీ కలగలిసి రాబోతున్న ఈ వినోదాత్మక చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. రేపు రానున్న ‘ఫస్ట్ బూస్టర్’తో సంక్రాంతి రేసులో ఈ క్రేజీ మూవీ మరింత ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది.














