
సినిమాల్లో క్రూరమైన విలన్గా కనిపిస్తూ ప్రేక్షకులను భయపెట్టే నటుడు జగపతిబాబు.. నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఎంతటి స్టార్డమ్ ఉన్నా చాలా సాధారణంగా ఉండే ఆయన, తన చుట్టూ ఉన్నవారితో ఎంతో ఆత్మీయంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తోంది. ఓ తోటలో పనిచేసే కూలీలతో కలిసి జగపతిబాబు భోజనం చేశారు. వారి కోసం ప్రత్యేకంగా బిర్యానీ తెప్పించి వడ్డించిన ఆయన.. తాను మాత్రం వారు ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం, కూరలను ఎంతో ఇష్టంగా తిన్నారు. అంతేకాదు, వాళ్లతో సరదాగా మాట్లాడుతూ భోజనాన్ని ఆస్వాదించారు.
సాధారణంగా సెలబ్రిటీల జీవితం అంటే లగ్జరీ కార్లు, ఖరీదైన ఆహారం, ప్రత్యేకమైన సౌకర్యాలు గుర్తుకొస్తాయి. కానీ జగపతిబాబు మాత్రం అలాంటి హంగులకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో జీవిస్తుంటారు. ‘మీరు ఏం తింటారో నాకు తెలియాలి.. అందుకే మీ భోజనమే నేను తింటాను’ అన్నట్టుగా కూలీలు తెచ్చుకున్న భోజనాన్ని రుచి చూడటం ఆయన మంచి మనసుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జగ్గూభాయ్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. నటుడిగా ఎంత ఎత్తుకు ఎదిగినా మనుషుల మధ్య అంతరాలు చూడకుండా అందరితో కలిసిపోయే ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Breaking News… Jantaki oka koora, 4 muddhala Annam thinni Rojjantha pani chesthuntey , noru oori valla bojjanam medha dhaadi chesadu Jaggu Bhai 😋 Idhiyemi Muchatooooo… https://t.co/YQ9pQReDcX
— Jaggu Bhai (@IamJagguBhai) November 26, 2026














