
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెన్నైలో జరిగిన తన సోదరుడి కుమారుడి వివాహానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వివాహ వేడుకకు తమిళనాడు రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు, నటులు హాజరుకావడంతో వేడుక మరింత వైభవంగా జరిగింది. సాధారణంగా ఏ కార్యక్రమంలోనూ ఎక్కువసేపు కనిపించని జగన్, ఈసారి మూడు రోజులు చెన్నైలో గడుపుతూ అతిథులతో ఆత్మీయంగా ముచ్చటించడం, పలువురిని హగ్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోలను వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, జగన్ చెన్నై పర్యటనను ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు.
ఈ వివాహ సందర్భంగా జగన్ తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్‌తో పాటు డీఎంకే, కాంగ్రెస్, ఏఐడీఎంకే నేతలను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అలాగే నటులు సూర్య, కార్తీ, దళపతి విజయ్, మోహన్ బాబు తదితర సినీ ప్రముఖులతో ఆయన ఆత్మీయంగా మాట్లాడిన దృశ్యాలు కూడా నెటిజన్లను ఆకట్టుకున్నాయి. వరుడు సాహిల్, వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు కాగా, వధువు కారైకుడికి చెందిన ప్రముఖ మురుగప్ప గ్రూప్ కుటుంబానికి చెందిన వేదిక. రెండు కుటుంబాల ఆచారాల ప్రకారం జరిగిన ఈ వివాహం, రాజకీయ–సినీ ప్రముఖుల హాజరుతో చెన్నైలో హాట్ టాపిక్‌గా మారింది.
చెన్నైలో వైయస్ సునీల్ రెడ్డి గారి (వైయస్ జగన్ పెదనాన్న వైయస్ జార్జిరెడ్డి కుమారుడు) కుమారుడి వివాహ వేడుకకు హాజరైన వైయస్ జగన్ గారి కుటుంబ సభ్యులు.
ఈ వేడుకలో వైయస్ జగన్ గారిని కలిసి, ఆత్మీయంగా పలకరించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ గారు, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు… pic.twitter.com/dighI1QFIX
— YSR Congress Party (@YSRCParty) February 8, 2026









