Athadu 4K : “అతడు” రీరిలీజ్ క్రేజ్.. మహేష్ బాబు సినిమా మళ్లీ మ్యాజిక్ చేయబోతోందా?

Athadu 4k release
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సూపర్ హిట్ క్లాసిక్ ‘అతడు’ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. 2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో ‘పార్థు’ పాత్రలో మహేశ్ ఇచ్చిన నేటివ్ పెర్ఫార్మెన్స్, స్టైల్ పంచ్‌లతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు. బ్రహ్మానందం కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అన్ని కలసి ఈ సినిమాను ఓ ఎప్పటికీ మర్చిపోలేని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిపాయి. టీవీల్లో అత్యధికంగా ప్రసారం అయిన సినిమాగా ‘అతడు’ పేరు ఖ్యాతి గడించింది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత ‘అతడు’ రీరిలీజ్‌తో మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. మహేశ్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీగా తిరిగి విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కి అపూర్వ స్పందన వస్తోంది, ముఖ్యంగా ఓవర్సీస్ లో. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ బయ్యర్లు మంచి ధరకు హక్కులు దక్కించుకున్నారు. వీకెండ్, థియేటర్లలో కొత్త సినిమాల లేవు, బాబు బర్త్ డే హంగామా — ఇవన్నీ కలసి ‘అతడు’కి రికార్డు స్థాయి వసూళ్లను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 70MM తెరపై మరోసారి ఈ మేజిక్‌ను చూడటానికి అభిమానులు ఎదురుచూస్తున్నారు.