Bakasura Restaurant : 250 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి ఓటీటీలో దూసుకుపోతున్న ‘బకాసుర రెస్టారెంట్’

Bakasura restaurent
Bakasura Restaurant : హారర్-కామెడీ శైలిలో తెరకెక్కిన ‘బకాసుర రెస్టారెంట్’ ఓటీటీలో ఊహించని ప్రభంజనం సృష్టిస్తోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పటివరకు 250 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు ఎస్.జె. శివ రూపొందించిన ఈ చిత్రంలో ప్రవీణ్, హర్ష , షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ తమ సహజ నటనతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించగా, బాల సరస్వతి అందించిన సినిమాటోగ్రఫీ, వికాస్ బడిసా అందించిన సంగీతం ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి.

Also Read :  Janhvi Kapoor: ‘పెద్ది’ రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్.. కాలినడకన కొండపైకి ఎక్కిన ‘అచ్చియమ్మ’ !

ప్రైమ్ వీడియోతో పాటు SUN NXT లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తక్కువ సమయంలోనే మంచి స్పందన పొంది ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారింది. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మంచి వేదికగా నిలుస్తున్నాయని ‘బకాసుర రెస్టారెంట్’ మరోసారి రుజువు చేసింది.

ఇక కథ విషయానికి వస్తే, రెస్టారెంట్ ఓపెన్ చేయాలని కలలు కనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రవీణ్, స్నేహితులతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో ఒక పాత ఇంట్లో దొరికిన పుస్తకం ద్వారా ఒక ఆత్మ (బక్క సూరి)ని పిలుస్తారు. ఆ ఆత్మ తిండిబోతు దెయ్యం కావడంతో, ఆ తర్వాత జరిగే గందరగోళం, భయపెట్టే సంఘటనలు, నవ్వులు పూయించే కామెడీ ఈ సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయి.