
Akhanda 2 : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్లు, ఫస్ట్ సింగిల్ ‘తాండవం’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై హైప్ పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో, మేకర్స్ తాజాగా మరో సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఈసారి రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ “జాజికాయ జాజికాయ..” లో బాలయ్య మాస్ డ్యాన్స్ అసలు హైలైట్‌గా నిలిచింది. కాసర్ల శ్యామ్ రాసిన క్యాచీ లిరిక్స్, శ్రేయా ఘోషల్–బ్రిజేష్ శాండిల్యా పాడిన ఎనర్జిటిక్ వాయిసెస్‌కు థమన్ ఇచ్చిన మాస్ బీట్ అదిరిపోయింది. గ్రాండ్ సెట్‌లో భాను మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్‌కు బాలకృష్ణ ఇచ్చిన ఎనర్జీ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. బీట్, స్టైల్, ఎనర్జీ, డ్యాన్స్ అన్నింట్లోనూ బాలయ్య మార్క్ పీక్‌లో కనిపించింది. ఈ సాంగ్ రిలీజ్‌తో సినిమాపై ఉన్న మాస్ ఊపు మరింత పెరిగిపోయింది. ఇక ఫ్యాన్స్ ఐతే ఇది కదా బాలయ్య బాబు రేంజ్ సాంగ్ అంటూ ఖుషి అవుతున్నారు.












