‘గుంటూరు కారం’ నుండి మహేష్ బర్త్ డే ట్రీట్.. గెట్ రెడీ !


సూపర్ స్టార్ మహేష్ బాబు లేటేస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక ఈ మూవీలో మహేష్ బాబు కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఇకపోతే రేపు మహేష్ బాబు బర్త్ డే. దీంతో ‘గుంటూరు కారం’ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు అర్ధరాత్రి 12 గం. 6 ని. లకు ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ని రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. రేపు సూపర్ స్టార్ సూపర్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేయడానికి మాతో చేరండి అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ మూవీ 2024లో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కానుంది.