Mangalavaram : అవార్డులతో అదరగొట్టిన ‘మంగళవారం’ !


‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన సినిమా ‘మంగళవారం’. థ్రిల్లింగ్ రెస్పాన్స్ తో థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఇటీవల పాపులర్ ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో విడుదలై ప్రపంచవ్యాప్త ప్రేక్షకులని కూడా అలరిస్తుంది.

‘మా మంగళవారం, టెక్నీషియన్స్ సినిమా అని గర్వంగా చెబుతున్నాను!’ అని డైరెక్టర్ అజయ్ భూపతి సక్సెస్ మీట్ లో చెప్పింది నిజం చేస్తూ ప్రతిష్ఠాత్మకంగా జరిగే జైపూర్ ఫిలిం ఫెస్టివల్ లో 4 అవార్డులని గెలుచుకుంది. ఉత్తమ నటి – పాయల్ రాజపుత్, ఉత్తమ సౌండ్ డిజైన్ – రాజా కృష్ణన్, ఉత్తమ ఎడిటింగ్ – గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – ముదసర్ మొహమ్మద్ లకు అవార్డులు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

కథ – కథనాలతో ఆకట్టుకుంటూనే సాంకేతిక పరంగా, నిర్మాణ పరంగా అద్భుతమైన విలువలున్న చిత్రంగా ‘మంగళవారం’ ఇప్పటికే దిగ్గజాల నుండి ప్రశంసలు అందుకోగా ఈ అవార్డులు కేవలం ఆరంభం మాత్రమే అని తమ ఆనందం వ్యక్తం చేసారు చిత్ర దర్శకుడు, నిర్మాతలు.