Odela 2 : ‘ఓదెల 2’ ఫస్ట్ లుక్.. ఫస్ట్ టైం తమన్నా ఈ గెటప్ లో


2022లో ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓదెల రైల్వే స్టేషన్. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ‘ఓదెల2’ వస్తోంది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది రూపొందించిన ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. ఇటీవలే ‘ఓదెల 2’ లో తమన్నా లీడ్ రోల్ లో నటిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమాలో తమన్నా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Megastar Chiranjeevi Honoured With The NTR National Film Award In Gaddar Awards 2025

ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, తమన్నా పోషిస్తున్న శివశక్తి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు మేకర్స్. ఈ పోస్టర్ లో తమన్నా మునుపెన్నడూ చూడని గెటప్ తో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. నాగ సాధువులా కాషాయ వస్త్రాలు ధరించి, ఒక చేతిలో పవిత్రమైన దండం, మరో చేతిలో డమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమతో శివశక్తిగా దర్శనమిస్తుంది. ఇక భారీ కాన్వాస్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరియు వశిష్ట ఎన్ సింహా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే ఈ సినిమా జాతీయ స్థాయిలో విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.