Nani: ‘ది ప్యారడైజ్’ వేదికగా నాని ఫైర్.. నెగెటివ్ బ్యాచ్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nani

Nani: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. దసరా లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో నాని మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న నెగెటివిటీ, టికెట్ రేట్ల పెంపు, సెప్టెంబర్ 23 రాత్రి ప్రీమియర్లపై నాని కుండబద్దలు కొట్టారు.

ఈ సందర్భంగా నాని ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో జరిగే అనవసర రాద్ధాంతాలు, నెగెటివిటీపై గట్టిగానే స్పందించారు. “మనం ఏదైనా పనిని సరిగ్గా, నిబద్ధతతో, నిరంతరం చేస్తూ పోతే ఎలాంటి నెగెటివిటీ అయినా దాని ముందు నిలబడలేదు” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకమే తమకు కొండంత బలం అని స్పష్టం చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు విషయంపై నాని అభిమానులకు భారీ ఊరటనిచ్చారు. సాధారణ ప్రేక్షకుడికి భారం కాకుండా, మినిమల్ హైక్స్ లేదా బేసిక్ రేట్లతోనే సినిమా అందుబాటులో ఉంటుందని పరోక్షంగా స్పష్టం చేశారు. ఇక అసలు పండగ సెప్టెంబర్ 24 విడుదల రోజు కాదని, సెప్టెంబర్ 23 రాత్రి నుంచే థియేటర్లలో రచ్చ మొదలవుతుందని ప్రకటించారు. “23వ తేదీ రాత్రే ప్రేక్షకులకు ఇచ్చే అసలైన స్పెషల్ గిఫ్ట్.. ఆ రోజు థియేటర్లలో మోత మోగిపోతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. “శ్రీకాంత్ నాకు తమ్ముడి లాంటివాడు. ఒక అన్నగా తన విజన్, కన్విక్షన్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈసారి ది ప్యారడైజ్‌తో థియేటర్లను మరో లెవల్‌కు తీసుకెళ్తాడు” అని కొనియాడారు. ఇక సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు రాఘవ్ జుయల్ గురించి చెబుతూ.. “ఈ రోజు షో మొత్తం రాఘవ్‌దే. అతనో అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైనర్. ఎలాంటి హోమ్‌వర్క్ లేకుండానే పాత్రలో జీవించేస్తాడు. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకడిగా ఎదుగుతాడు. నీకు ఎల్లప్పుడూ తోడుగా ఈ అన్నయ్య ఉంటాడు” అని అభినందించారు.

అనిరుధ్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ అయ్యాయని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో ఫైర్‌ఫైజ్ (విధ్వంసం) సృష్టించబోతున్నారని చెప్పారు. సీనియర్ నటి సోనాలి కులకర్ణి పాత్రను ప్రేక్షకులు విపరీతంగా ప్రేమిస్తారని, సింగిల్ స్క్రీన్లలో ఆమె పాత్రకు వచ్చే రెస్పాన్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ కాయదు లోహర్ ఎంతో క్లిష్టమైన సన్నివేశాల్లోనూ ‘సుబ్బు’ పాత్రను చాలా అద్భుతంగా చేసిందని ప్రశంసించారు. మొత్తంగా చూస్తే.. సెప్టెంబర్ 23 రాత్రి నుంచే బాక్సాఫీస్ వద్ద ప్యారడైజ్ సంబరాలు మొదలుకానున్నాయి. నాని కాన్ఫిడెన్స్ చూస్తుంటే మరో బ్లాక్‌బస్టర్ ఖాతాలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.