12A Railway Colony : భీమ్స్ ట్యూన్స్ మ్యాజిక్ – అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’ ఫస్ట్ సాంగ్ విడుదల!

12arailwaycolony
12A Railway Colony : అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ చిత్రం ’12A రైల్వే కాలనీ’ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి, పోలిమేర సిరీస్‌తో పాపులర్ అయిన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Peddi : 'పెద్ది' డబ్బింగ్ స్టార్ట్.. వైరల్ అవుతున్న చరణ్ కామెంట్స్!

మ్యూజిక్ ప్రమోషన్‌లలో భాగంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ‘కన్నోదిలి కలనోదిలి’ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ వోకల్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవ్ పవార్ రాసిన లిరిక్స్ ప్రేమ భావాలను అందంగా వ్యక్తం చేస్తూ, భీమ్స్ మ్యూజిక్ టచ్‌తో పాటకు ఫీల్ గుడ్ వైబ్‌ని ఇచ్చాయి. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ విజువల్స్‌లో బాగా కనిపిస్తోంది. ఎమోషన్స్, ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read :  Hansi Productions బ్యానర్‌పై యూత్‌ఫుల్ లవ్ డ్రామా ప్రారంభం