
Bloody Romeo: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్లడీ రోమియో’. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రంపై సినీ అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘బ్లడీ రోమియో’ ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్‌లో కథకు అత్యంత కీలకమైన సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే చిత్ర బృందం రెండో షెడ్యూల్ కోసం లండన్‌కు వెళ్లనుందట. ముఖ్యంగా లండన్‌లోనే సినిమా మొత్తం షూటింగ్‌ను ఒకే కంటిన్యూయస్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌కు ఎలాంటి విరామాలు ఇవ్వకుండా వరుసగా చిత్రీకరణ జరిపి, ఈ ఏడాది ముగిసేలోపే మొత్తం చిత్రీకరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో యూనిట్ పనిచేస్తోందని చెబుతున్నారు.
యాక్షన్, ఎమోషన్, స్టైలిష్ విజువల్స్ కలగలిపిన ఈ చిత్రాన్ని సుజిత్ తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారని టాక్. నాని కూడా తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొనగా, షూటింగ్ అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్‌ను తీసుకొస్తున్నాయి. అయితే, షూటింగ్ షెడ్యూళ్లు, లొకేషన్లకు సంబంధించిన వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













