Mega Buzz: మెగాస్టార్ చిరంజీవి – కింగ్ నాగార్జున కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ ఆయనే?

Mega Buzz

Mega Buzz: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపిస్తే అభిమానుల్లోనే కాకుండా, ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడతాయి. ఇప్పుడు అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌లో నటించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ వార్త బయటకు రావడంతో మెగా, అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

తన కామెడీ టైమింగ్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఏ విధంగా చూపించబోతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయన వెంకటేష్ – నందమూరి కల్యాణ్ రామ్‌లతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు చిరంజీవి – నాగార్జున – అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ కాంబో నిజమైతే మాత్రం టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు తెరలేచినట్లే అని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘మెగా 158’ చిత్రంలో నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్ తర్వాత మరోసారి చిరు – బాబీ కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే నాగార్జున కూడా తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని రా కార్తీక్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈక్రమంలో వారి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ రాబోతుందనే టాక్ బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి.