
yatra: వైవిధ్యమైన నటనతోనే కాకుండా విలక్షణమైన దర్శకత్వ ప్రతిభతోనూ మెప్పించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ఇప్పుడు తన కొడుకు యాత్ర (Yatra)ను వెండితెరకు పరిచయం చేసేందుకు సర్వం సిద్ధం చేశారట. ధనుష్ స్వీయ దర్శకత్వంలో యాత్ర హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను #RTakeStudios సంస్థ నిర్మించనుందని సమాచారం. నిజానికి ఇదే ప్రొడక్షన్ హౌస్ ధనుష్ హీరోగా రాబోతున్న మైల్‌స్టోన్ మూవీ #D55 ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తుండటం విశేషం.
ఇటీవలే ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయన్’ సినిమాలో యాత్ర ఒక చిన్న పాత్రలో మెరిసి ప్రేక్షకులను అలరించాడు. అయితే ఇప్పుడు ఆయన హీరోగా రాబోయే సినిమా మాత్రం ఒక పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం. ధనుష్ తన కొడుకు బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కోసం కోలీవుడ్ టాప్ టెక్నీషియన్లు రంగంలోకి దిగుతున్నారట. ఈ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ వేల్‌రాజ్ విజువల్స్, జి.వి. ప్రకాష్ సంగీతం అందించే అవకాశాలు ఎక్కువగా సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రమోషనల్ షూట్ త్వరలోనే చెన్నైలో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఆ వెంటనే చిత్ర యూనిట్ ఒక గ్రాండ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి సినిమాను అధికారికంగా లాంచ్ చేయనుందని కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ సినిమాలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన కొందరు స్టార్ నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు టాక్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.














