
George Krish: టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జార్జ్ కృష్ణ’. ప్రస్తుతం ఈ సినిమాపై రోజుకో పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆమె ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తైనట్లు సమాచారం. రెండో షెడ్యూల్‌ను ఆగస్టు రెండో వారంలో స్టార్ట్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. డైరెక్టర్ శ్రీను వైట్లకు ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. గత కొన్నేళ్లుగా సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయనకు ‘జార్జ్ కృష్ణ’ కమ్‌బ్యాక్ మూవీగా నిలవొచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యాక్షన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్‌తో మేకర్స్ వేగంగా షూటింగ్ పూర్తి చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.









