Madharaasi : గెట్ రెడీ ఫర్ ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మదరాసి’

Madharaasi
Madharaasi : టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ, ‘రమణ’, ‘గజిని’, ‘తుపాకి’, ‘కత్తి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. సోషల్ మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమాలను తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. తెలుగులో కూడా ఆయన సినిమాలు ఘనవిజయం సాధించాయి. ముఖ్యంగా ‘ఠాగూర్’, ‘ఖైదీ 150’ వంటి మెగాస్టార్ చిరంజీవి రీమేక్‌లు సూపర్‌హిట్స్ అయ్యాయి. అంతేకాకుండా మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’ కూడా మంచి అంచనాలు రేపింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సర్కార్’, ‘దర్బార్’, ‘సికిందర్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలవలేదు.

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

కానీ ఇప్పుడు మురుగదాస్ తన సాలిడ్ కంబ్యాక్ కోసం శివకార్తికేయన్ హీరోగా రూపొందించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’తో సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ అద్భుతమైన హైప్ క్రియేట్ చేశాయి. ‘అమరన్’ విజయం తర్వాత శివకార్తికేయన్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. శ్రీలక్ష్మీ మూవీస్‌పై నిర్మాత ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, తమిళ్‌తో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమై ప్రేక్షకులను అలరించబోతోంది.