Karthi 29 : ‘మార్షల్’ షూటింగ్ స్టార్ట్… ఇంటెన్స్ లుక్‌లో కార్తీ!

Marshal
Karthi 29 : విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘తానక్కారన్’ ఫేమ్ డైరెక్టర్ తమిజ్‌తో హీరో కార్తీ తన 29వ చిత్రానికి కాలు మోపారు. ఈ చిత్రానికి ‘మార్షల్’ అనే టైటిల్‌ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై SR ప్రకాష్ బాబు, SR ప్రభు నిర్మిస్తుండగా, ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తీని ఇంటెన్స్ లుక్‌లో చూపించిన టైటిల్ పోస్టర్‌తో పాటు పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.

Also Read :  జగపతి బాబు 'వదలా' ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ రిలీజ్...

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించనుండగా, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సాయి అభ్యాంకర్ సంగీతం అందించనుండగా, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైన్ అందిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ‘మార్షల్’, కార్తీ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.