Mahesh Babu: డూప్ లేకుండా మహేష్ సాహసం.. బిత్తరపోయిన జక్కన్న!

Varanasi

Mahesh Babu: భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఆయన దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి బయటకు వచ్చిన ఒక అద్భుతమైన వార్త సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఫైట్స్, నిప్పుల కొలిమిని తలపించే విజువల్ సీక్వెన్స్‌లలో మహేష్ బాబు ఎలాంటి ‘బాడీ డూప్’ లేకుండా నేరుగా తానే స్వయంగా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారట. సాధారణంగా భారీ వీఎఫ్ఎక్స్, రిస్క్‌తో కూడిన సన్నివేశాల్లో స్టార్ హీరోలు డూప్‌లను ఆశ్రయిస్తుంటారు. కానీ ఈ చిత్రంలో మహేష్ చూపిన తెగువ, డెడికేషన్‌ను చూసి స్వయంగా జక్కన్నే ప్రశంసల వర్షం కురిపించారట. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మహేష్ చేసిన ఈ సాహసాలు వెండితెరపై ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ కోసం సాంకేతిక బృందం పడిన కష్టం వర్ణనాతీతం అంట. కాశీలోని ప్రసిద్ధ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయంతో పాటు అక్కడి చారిత్రక ఘాట్‌లను రీక్రియేట్ చేయడానికి హైదరాబాద్‌లో ఏకంగా తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో భారీ సెట్ నిర్మించారు. కేవలం ఈ ఒక్క సెట్ కోసమే నిర్మాతలు సుమారు రూ. 23 కోట్ల భారీ బడ్జెట్‌ను వెచ్చించినట్లు సమాచారం. దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివితో, నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో వారణాసిని విజువల్ వండర్‌గా రాజమౌళి తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్రల్లో కనిపిస్తుండటంతో సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ప్రపంచ సినీ ప్రియులను మెస్మరైజ్ చేసేందుకు ఈ చిత్రం 2027, ఏప్రిల్ 7న థియేటర్లలోకి అడుగుపెట్టనుంది.