
My Baby : తమిళంలో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ ‘DNA’ తెలుగులో ‘మై బేబి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18, 2025న గ్రాండ్‌గా విడుదల కానుంది. మానవ సంబంధాల నేపథ్యంలో, ఎమోషనల్ థ్రిల్లింగ్‌తో కూడిన కథాంశం ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
నిర్మాత సురేష్ కొండేటి తెలుగులో ‘జర్నీ’, ‘పిజ్జా’, ‘షాపింగ్ మాల్’ వంటి అనువాద సినిమాలతో గుర్తింపు పొందారు. ఇప్పుడు అదే ధాటిలో ‘మై బేబి’ను కూడా అందిస్తున్నారు. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించారు. 2014లో ఓ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై విడుదల కానున్న ఈ సినిమా, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేయనుంది.











