
Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సినిమాలను ప్రోత్సహిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పళ్ల బురుసు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము సినిమాలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. “డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదు.. తిరిగి సినిమా ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో సినిమాలు మొదలుపెట్టాం” అని నాగార్జున తెలిపారు. ఇటీవలే ‘లెనిన్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని, ఇప్పుడు ‘పళ్ల బురుసు’ విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు.
అంతేకాకుండా తమ నుంచి రాబోయే సినిమాల గురించి కూడా నాగార్జున ప్రస్తావించారు. ‘పళ్ల బురుసు’ తర్వాత ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా విడుదల కానుందని తెలిపారు. మరో రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తన కెరీర్లో వందో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో నాగార్జున 100వ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తమ ప్రయాణం ఒక్క సంవత్సరానికే పరిమితం కాదని నాగార్జున స్పష్టం చేశారు. ఈ ఏడాది మాత్రమే కాకుండా వచ్చే ఏడాది, ఆ తర్వాత కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంటామని తెలిపారు. కొత్త కథలు, కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీకి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ‘పళ్ల బురుసు’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ముఖ్యంగా ఆయన 100వ సినిమా ప్రస్తావన అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.














