కలర్ ఫొటో’ టీం నుంచి మరో కల్ట్ మూవీ !


“కలర్ ఫొటో”, “బేబి” వంటి సంచలనాత్మక సినిమాలు అందించిన దర్శకుడు సాయి రాజేశ్, ప్రముఖ ప్రొడ్యూసర్ SKNల కాంబినేషన్‌లో మరో క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి రాజేశ్ కథ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు మేకర్స్, ఆసక్తికర పోస్టర్‌తో సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు గ్లింప్స్ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

Also Read :  Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక 'రాకాస' టీజర్

ఈ మూవీ టైటిల్, గ్లింప్స్‌ను జూన్ 2వ తేదీ సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదల చేయనున్నారు. దీనితో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. అందులో బీచ్‌లో ఓ యువ జంట కలసి నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఆ బీచ్ పక్కనే ఉన్న బండి మీద ప్రముఖ దర్శకుడు కే. బాలచందర్ ఫోటో ఉండడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ జంట ఎవరు? ఎందుకు బాలచందర్ గారి ఫోటో చూపించారు? అనే విషయంలో ఉత్సాహం నెలకొంది.

Also Read :  Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి క్లాసీ టైటిల్ ఫిక్స్..

ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం. చాలా కాలం తర్వాత ఆయన ఈ జెనరేషన్ సినిమాకు మ్యూజిక్ అందించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. జూన్ 2న రానున్న టైటిల్, గ్లింప్స్‌పై టాలీవుడ్‌లో భారీ ఆసక్తి నెలకొంది.