
Pawan Kalyan: సినీ ప్రేమికులకు, పరిశ్రమలోకి అడుగుపెట్టాలని తహతహలాడే కొత్త ప్రతిభావంతులకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అదిరిపోయే క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా క్రాఫ్ట్స్ మేధావులను, ఔత్సాహికులను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టాలెంట్ ఉండి సరైన ప్లాట్‌ఫారమ్ కోసం ఎదురుచూస్తున్న వారికి, సరికొత్త ఐడియాలతో ఇండస్ట్రీని షేక్ చేయాలనుకునే రీసెర్చర్లకు ఇదొక సువర్ణావకాశం అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ కేవలం సినిమాలు తీయడమే కాకుండా, సినిమా రంగానికి చెందిన అన్ని విభాగాల్లోనూ సరికొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు రెడీ అయ్యింది. సినిమా పట్ల విపరీతమైన ప్యాషన్ ఉన్న క్రియేటర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ నెట్‌వర్క్‌లో భాగం కావచ్చు. కేవలం సీనియర్ ప్రొఫెషనల్స్ మాత్రమే కాదు.. ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇందులో చేరవచ్చని సంస్థ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. సినిమా 24 క్రాఫ్ట్స్‌లో మీకు ఏ విభాగంలో ప్రవేశం ఉన్నా, కొత్తగా ఏదైనా సాధించాలనే తపన ఉన్నా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సరికొత్త నెట్‌వర్క్ ద్వారా గ్లోబల్ లెవెల్ టెక్నాలజీ, ఐడియాస్ ఒకరికొకరు షేర్ చేసుకునే వీలుంటుంది. సినీ ప్రపంచంలోని ప్రతి ఒక్క ప్రతిభను ఒకే చోట చేర్చి, అద్భుతమైన క్రియేటివిటీని వెలికితీయడమే ఈ గ్లోబల్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీలోని టాలెంట్‌కు గ్లోబల్ ప్లాట్‌ఫారమ్ దక్కాలంటే వెంటనే ఈ #PKCWCommunity లో భాగస్వాములు అవ్వండి.
Join the #PKCWCommunity now.
Pawan Kalyan Creative Works invites passionate creators, technicians, artists,aspiring amateurs, professionals and researchers from every craft of cinema to join the global PKCW creative ecosystem.@PawanKalyanhttps://t.co/YWPlOwQ2zG
— Pawan Kalyan Creative Works (@PKCWoffl) July 1, 2026














