Priyadarshi: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్.. సుకుమార్, బన్నీ వాస్ నిర్మాణంలో హీరోగా ప్రియదర్శి.. దర్శకుడు ఎవరంటే?

Priyadarshi

Priyadarshi: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలతో, విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి. ఈ హీరోకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఆయన ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని చెబుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని సమాచారం. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో ముందుండే ఈ ఇద్దరు.. ఇప్పుడు ప్రియదర్శితో సినిమా చేస్తున్నారనే టాక్ జోరుగా ప్రచారం అవుతుంది.

Also Read :  Ram Charan: మైండ్ బ్లాంక్ అయ్యేలా రామ్ చరణ్ లైనప్.. ఆ ముగ్గురు డైరెక్టర్లతో బొమ్మపడితే బాక్సాఫీస్ బద్దలే!

ఈ సినిమా ద్వారా సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఆయన శిష్యులలో ఒకరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చే దర్శకులు స్క్రీన్‌ప్లే పరంగా ఎంత వైవిధ్యంగా ఆలోచిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘కుమారి 21F’, ‘ఉప్పెన’ లాంటి చిత్రాలు దీనికి ఉదాహరణలు. ఒక విభిన్నమైన స్టోరీ లైన్‌తో లెక్కల మాస్టార్ శిష్యుల్లో ఒకరైన యంగ్ డైరెక్టర్ ప్రియదర్శిని ఇంప్రెస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.