Rage Of Kaantha : ‘కాంత’ పై అంచనాలు పెంచుతున్న ‘రేజ్ ఆఫ్ కాంత’..!

Kaantha
Rage Of Kaantha : దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్ పీరియాడికల్ మూవీ ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1950ల మద్రాస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌గా రూపొందింది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే టీజర్ మరియు సాంగ్స్‌తో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేసిన మేకర్స్, తాజాగా రాప్ ఆంథమ్ “రేజ్ ఆఫ్ కాంత” ను విడుదల చేశారు.

Also Read :  Peddi Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర 'పెద్ది' శివతాండవం.. జూన్ 4న 'పెద్ది' బుకింగ్స్ రికార్డ్స్ ఇవే!

ఈ సాంగ్‌కు ఝాను చాంతర్ సంగీతం అందించగా, ట్రాక్‌లోని ఎనర్జీ, బీట్‌లు, లిరికల్ ప్యాటర్న్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. వింటేజ్ టచ్ ఉన్న మోడర్న్ రాప్ బీట్స్, పవర్‌ఫుల్ గిటార్ సౌండ్స్‌తో ఈ ట్రాక్ అద్భుతంగా వుంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. డానీ సాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్రఫీ, థా. రామలింగం ఆర్ట్ డైరెక్షన్, తమిళ్ ప్రభ స్క్రీన్‌ప్లే, లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. ‘కాంత’ చిత్రం నవంబర్ 14న తెలుగు మరియు తమిళంలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Also Read :  NBK 111: బాలయ్య ఫ్యాన్స్ గోపీచంద్ ఫుల్ మీల్స్ .. జూన్ 10న మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ అంటూ పోస్ట్!