Ramayana: హాలీవుడ్ వేదికగా ‘రామాయణ’ విజువల్ వండర్.. లాస్ ఏంజెల్స్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్!

Ramayana

Ramayana: భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ (Ramayana). ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గ్లోబల్ రిలీజ్ స్ట్రాటజీలో భాగంగా సరికొత్త ప్లాన్‌ను మేకర్స్ రెడీ చేశారు. ఈ సినిమా మెగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హాలీవుడ్ కొలువుదీరిన లాస్ ఏంజెల్స్ వేదికగా అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నట్లు అంతర్జాతీయ సినీ వర్గాల సమాచారం.

వచ్చే నెల జూలై 14న లాస్ ఏంజెల్స్‌లో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్‌లో చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (శ్రీరాముడు), టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి (సీతాదేవి), రావణాసురుడిగా నటిస్తున్న రాకింగ్ స్టార్ యష్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారని టాక్. హాలీవుడ్ మీడియా సమక్షంలో భారీ ఎత్తున ఈ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Also Read :  Hrithik Roshan: చెన్నైలో ల్యాండ్ అయిన హృతిక్ రోషన్.. ఎందుకో తెలుసా?

ఈ చిత్ర విడుదల తేదీకి సరిగ్గా 105 రోజుల ముందే ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. ఈ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాకు, ఈ రేంజ్‌లో గ్లోబల్ ప్రమోషన్స్ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు అంతర్జాతీయ స్థాయికి చేరాయి. ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా డైరెక్టర్ నితీష్ తివారీ ఈ విజువల్ వండర్‌ను విజువల్ ఎఫెక్ట్స్‌తో అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అప్‌డేట్‌తో ఇటు నార్త్, అటు సౌత్ ఆడియన్స్‌లో పూనకాలు మొదలయ్యాయి. దీని గురించి చిత్ర బృందం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.