
RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘RAPO23’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా పుదుచ్చేరి షెడ్యూల్లో చిత్రబృందం భారీ స్థాయిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించింది. నగర శివార్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్లో వరుసగా తొమ్మిది రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు సమాచారం. వర్షాల కారణంగా ప్రస్తుతం చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందట. ఈ షెడ్యూల్లో భాగంగా రాత్రివేళల్లోనూ భారీ యాక్షన్, ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్రాంతానికి సంబంధించిన ఏరియల్ విజువల్స్ ఇప్పుడు ఈ సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి.
ఈ భారీ షెడ్యూల్లో రామ్ పోతినేని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నట్లు చిత్రబృందం చెబుతుంది. తొమ్మిది రోజుల పాటు నిరంతరంగా షూటింగ్లో పాల్గొంటూ కీలక సన్నివేశాలను పూర్తి చేసేందుకు ఆయన ప్రత్యేకంగా శద్ధ్ర తీసుకున్నట్లు చెబుతున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రామ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే పుదుచ్చేరిలో కురిసిన భారీ వర్షాల కారణంగా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందట. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన వెంటనే చిత్రబృందం తిరిగి అదే లొకేషన్‌కు వెళ్లి మిగిలిన సన్నివేశాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ‘RAPO23’లో ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్, విస్తృతమైన షూటింగ్ షెడ్యూల్స్ చూస్తుంటే ఈ సినిమా భారీ స్కేల్లో రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది.














