Ravi Teja: రిలీజ్‌కు ముందే ‘ఇరుముడి’ జాతర.. ఊహించని రేటుకు రవితేజ మూవీ ఓటీటీ డీల్ క్లోజ్!

Irumudi

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ప్రస్తుతం సినీ సర్కిల్‌లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తుంది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే నాన్-థియేట్రికల్ హక్కుల కోసం ఇండస్ట్రీలో గట్టి పోటీ నడుస్తోంది. ఈ క్రమంలోనే ‘ఇరుముడి’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ (OTT) హక్కులు భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.

Also Read :  Irumudi: ఆగస్టు 21న మాస్ మహారాజా జాతర.. రవితేజ 'ఇరుముడి' రిలీజ్ డేట్ అఫీషియల్!

గట్టి పోటీలో భారీ మొత్తంలో వెచ్చించి నెట్‌ఫ్లిక్స్ ‘ఇరుముడి’ డిజిటల్ హక్కులను దక్కించుకుందని ఇండస్ట్రీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా కథపై ఉన్న నమ్మకంతో పాటు ట్రేడ్ సర్కిల్స్‌లో ఈ చిత్రానికి ఉన్న హైప్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.14 కోట్లకు అటు ఇటుగా చెల్లించి డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రేంజ్‌కు, కంటెంట్‌కు తగ్గట్లుగా ఇది చాలా క్రేజీ డీల్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముడి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.