Mass Jathara OTT : ఓటీటీలోకి రవితేజ ‘మాస్ జాతర’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Massjathara
Mass Jathara OTT : మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా భాను భోగవరపు దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘మాస్ జాతర’. ‘ధమాకా’ హిట్ తర్వాత మరోసారి శ్రీలీల, రవితేజ కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది. కానీ అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

Also Read :  ఏప్రిల్ 3న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతున్న   తెలుగు–తమిళ  ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’...

ఈమేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్‌ 28 నుంచి ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.