Sambarala Yetigattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల యేటిగట్టు’ గ్లింప్స్ – విజువల్స్ & యాక్షన్ అదుర్స్!

Syg
Sambarala Yetigattu : మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రెస్టీజీయస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ‘సంబరాల యేటిగట్టు (SYG)’ తో ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. డెబ్యుట్ దర్శకుడు రోహిత్ కె.పి. దర్శకత్వంలో, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి దాదాపు ₹125 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రంగా మారనుంది. తాజాగా తేజ్ బర్త్ డే సందర్భంగా ‘అసుర ఆగమన’ అంటూ ఈ మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read :  Peddi Inside Talk: థియేటర్లలో ‘పెద్ది’ సునామీ.. మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ టాక్!

సాయి దుర్గ తేజ్‌ను ఓ పవర్ ఫుల్ యోధుడిగా పరిచయం చేస్తూ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉన్నాయి. కండలు తిరిగిన ఆ దేహాన్ని చూస్తుంటే తేజ్ ఈ మూవీ కోసం ఎంతలా శ్రమించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాంతార ఫేమ్ బి.అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వుంది. ఈ మూవీని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు టీం శ్రమిస్తోంది. ఈ గ్లింప్స్‌తో సంబరాల యేటిగట్టు (SYG) ఓ భారీ యాక్షన్, ఎమోషనల్, పీరియాడిక్ డ్రామాగా ఉంటుందని అర్థం అవుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో పాన్-ఇండియా వైడ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది.

Also Read :  Jagapathi Babu: బసిరెడ్డి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్.. ‘అప్పలసూరి’: జగపతిబాబు