
The Paradise: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ‘దసరా’ తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఏషనాగుల’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ పాటలోని మాస్ బీట్, నాని ఎనర్జిటిక్ స్టెప్పులు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పాట విడుదలైన తర్వాత కొరియోగ్రఫీపై కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఈ పాట మేకింగ్‌కు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆసక్తిని పెంచింది.
‘ది ప్యారడైజ్’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఇలాంటి భారీ పాటను కొరియోగ్రాఫ్ చేసే అవకాశం రావడం తనకు ఎంతో ప్రత్యేకమని సందీప్ పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశాన్ని అందించిన నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టిన వర్కింగ్ స్టిల్స్‌లో పాట కోసం చిత్రబృందం చేసిన కసరత్తు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రేక్షకులు తెరపై మూడు, నాలుగు నిమిషాల పాటను ఆస్వాదిస్తారు. కానీ ఆ పాట వెనుక కొరియోగ్రాఫర్ విజన్‌తో పాటు హీరో డెడికేషన్, డ్యాన్సర్లు, టెక్నీషియన్లు, మొత్తం టీమ్ కష్టం ఉంటుంది. ముఖ్యంగా భారీ అంచనాలున్న సినిమాకు ఓ మాస్ సాంగ్‌ను తెరకెక్కుస్తున్న సమయంలో మరింత సవాలుతో కూడుకున్న పని. ‘యేషనగుల’ పాటకు వస్తున్న స్పందన చూస్తే ఆ కష్టం ఫలించినట్లే కనిపిస్తోంది. సరైన అవకాశం, ప్రతిభ, కష్టపడి పనిచేసే తపన కలిసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుందో ‘ఏషనాగుల’ సాంగ్ మరోసారి చూపిస్తోందని అభిమానులు అంటున్నారు. పాటకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్రబృందం కూడా ఫుల్ జోష్‌లో ఉంది. ఇక ఈ విజువల్ అండ్ మ్యూజికల్ ఫీస్ట్‌ను పూర్తి స్థాయిలో థియేటర్లలో చూడటానికి మరికొంత సమయం మాత్రమే ఉంది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందే గతంలో ఆయా షేర్, ప్రస్తుతం ‘ఏషనాగుల’ క్రియేట్ చేసిన హైప్.. థియేటర్లలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.














